
జనసముద్రం న్యూస్ జూలై 12 హుజురాబాద్ తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని 15వ వార్డు కాంగ్రెస్ నాయకుడు ఉప్పు శ్రీనివాస్ పటేల్ అన్నారు. స్థానిక హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి మరియు మంత్రులు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ఉన్న ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు.. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవస్థాన చైర్మన్ కోలిపాక శంకర్ నరేశ్,రాఘవేంద్ర,ఎర్ర శ్రీనివాస్,కో రమేష్ ఆలేటి సుశీల పాల్గొన్నారు