
జనసముద్రంన్యూస్, వెల్దుర్తి మండలం, జూలై 12 ;
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదిలివీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ డ్రోన్లు, హైబ్రిడ్ రకం కంది విత్తనాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై రైతులతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.