
పాల్గొన్న కటికల బాలకృష్ణ ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు
జనసముద్రంన్యూస్, కారంపూడి , జూలై 12 ;
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పట్టణంలోని 281వ బూత్ లో శుక్రవారం “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి” కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కారంపూడి మాజీ పట్టణ అధ్యక్షులు కటికల బాలకృష్ణ , బూత్ ఇంచార్జ్ సాగినబోయిన నాగరాజు, తోకల శ్రీనివాసరావు, నాగేటి పుల్లయ్య,వాదుల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.