
జనసముద్రం న్యూస్, బాకారపేట, జులై 12:-
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా వ్యాన్ ఢీకొని ఒకరు మృతి.కళ్యాణి డ్యాం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదం
మృతి చెందిన వ్యక్తి మహబూబ్ బాషా (58 స) భాకరాపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తింపు.
మృతుడు కాశిపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీలో పాల సేకరణ విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
విధులు ముగించుకొని స్వగ్రామమైన భాకరాపేటకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
టమాటా వ్యాన్లో ప్రయాణిస్తున్న వారికి ఇద్దరికీ గాయాలయ్యాయి.
క్షతగాత్రులను అంబులెన్స్ వాహనంలో తిరుపతి రూయ కి తరలించారు.చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.