
జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు
- కూరపాటి ప్రదీప్ అన్నను కలిసిన నవీన్ మీ సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలి కోలా నవీన్ కుమార్
అంబేద్కర్ విద్యార్థి యువజన సమైక్య సంఘం అధ్యక్షులు
జన సముద్రం న్యూస్,
ఖమ్మం, జులై 1: జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని పలువురు డాక్టర్లను అంబేద్కర్ విద్యార్థి యువజన సమాఖ్య సంఘం అధ్యక్షులు కోల నవీన్ కుమార్, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని యూత్ ఎక్కువగా అభిమానించే యువ వైద్యులు ఏదైనా సహాయం కోసం అడిగితే కాదనకుండా ఇచ్చే గొప్ప మనసున్న డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, అన్నను మర్యాదపూర్వకంగా నవీన్ కలిశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి లో బిజీగా ఉంటూ అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తు చేశారు తలసీమియా సికిల్ సెల్ వ్యాధి పై అవగాహన కల్పిస్తూ అనేకమందిని చైతన్యపరుస్తున్నారన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని గుర్తు చేశారు. రానున్న కాలంలో ఎంతోమందికి ఉచిత వైద్యం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. జిల్లాలోని వివిధ డాక్టర్లకు ప్రత్యేకంగా జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కోలా నవీన్,
ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది మెడికల్ షాప్ రమేష్, సూర్యా, అనిల్, లక్ష్మణ్, నరేష్, ఉపేందర్, సీనియర్ రిసెప్షన్ దామల శివ ఊహ తదితర డిపార్ట్మెంట్స్ సిబ్బంది పాల్గొన్నారు.