
యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.02)
జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎల్ హెచ్ పి ఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గిరిజన బాలికల హాస్టల్ దగ్గర ఎల్ హెచ్ పి ఎస్ (లంబాడి హక్కుల పోరాట సమితి)రాష్ట్ర కార్యదర్శి దీరావత్ రాజేష్ నాయక్ జండా ఆవిష్కరణ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు పరచడం చాలా నిర్లక్ష్యంగా చేస్తుంది అని,గిరిజన వర్గాల వారికి మంత్రి పదవిలో స్థానం కల్పించకపోవడం చాలా బాధాకరం,ఎస్టి కార్పొరేషన్ కింద గిరిజన వర్గాల వాళ్లకు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద ఎలాంటి షరతులు లేకుండా లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ధరావత్ రాజు నాయక్,జిల్లా ఇంచార్జి భాస్కర్ నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట ఉపాధ్యక్షుడు రాములు నాయక్,పట్టణ అధ్యక్షుడు మోహన్ నాయక్, జిల్లా నాయకులు నరసింహ నాయక్,గిరిజన విద్యార్థులు తదితరులు పాల్గొనారు.