
జనసముద్రం న్యూస్ జులై 2
ఎల్కతుర్తి మండలం
ఎల్కతుర్తి మండల కేంద్రంలో కూడా ఆధ్వర్యంలో సుందరికరణ పనులు బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ కూడలిలో రోడ్లు పనులు పూర్తి కావచ్చాయి. డ్రైన్ నిర్మాణ పనులు మాత్రం నత్త నడకనకొన సాగుతున్నాయి. డ్రైన్ నిర్మాణంలో ఇష్టం వచ్చినట్టు వంకలు వంకలుగా డ్రైన్ నిర్మాణము చేస్తున్నారు. అధికారుల పరివేక్షణ కరువైంది, డ్రైన్ నిర్మాణం కొరకు మట్టి తీయడం తొ షాపులకు సమానుకోసం వచ్చే ప్రజలకు ఇంటి,షాపుల యజమానులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలుపుతూ తొందరగా డ్రైన్ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.