
గ్రామ పంచాయితీ ఈవోకు డిమాండ్స్ పత్రం అందజేత.
జన సముద్రం న్యూస్ జూన్ 24 బ్యూరో చీప్ టెంపుల్ టౌన్ భద్రాచలం
భద్రాచలం గ్రామపంచా
యతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు వెంటనే చేయాలి, వీధిలైట్లు ప్రతి కాలనీలో వేయాలి, డ్రైనేజీ పూడిక లు తీయాలి, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భద్రాచలం బిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ మానే రామకృష్ణ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాసరావుకువినతి పత్రం అందజేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ0 18 నెలల పాలనలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలు ఈరోజు వరకు కూడా అమలు కాలేదు. ఈ హామీలు అమలయ్యే వరకు,బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తూ ఉంటామని,
తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వం పై ఆందోళన చేస్తూ ప్రశ్నిస్తూనే ఉంటా మని బిఆర్ఎస్ పార్టీ నేతలు
తెలిపారు.
ఈ కార్యక్రమ0 లో
భద్రాచలం బి ఆర్ ఎస్ కోకన్వీనర్. రేపాక. పూర్ణ, ఇతర నాయకులు టి. ధనేశ్వరరావు, ప్ర బోద్ కుమార్, సీతా మహాలక్ష్మి, మహిళా మండలి కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్, కార్మిక వర్గ, బి ఆర్ టి యు నాయకులు మరియు మహిళా నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేశారు. వర్షం చినుకులు పడుతున్నప్పటికీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.