
జనసముద్రం న్యూస్
కూకట్పల్లి ప్రతినిధి జూన్ 24
కూకట్పల్లి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ లో 18 లక్షల అంచనా వ్యయంతో మరియు పాపమ్మ కాలనీ లో 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, జగదీష్, అశోక్, రామకృష్ణ, ఎ.ఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.