
—తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా (జూన్.24)
జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని సర్వే నెంబరు 80 లోని 12 ఎకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న 150 మంది పేదలకు తక్షణం పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రోజున భూధాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో ఇండ్లు లేని పేదలు ఒకే ఇంట్లో ఉన్న రెండు మూడు కుటుంబాలకు సంబంధించిన వారందరూ కలిసి సర్వే నెంబరు 80 లో గుడిసెలు వేసుకుంటున్న వారికి మద్దతుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జి.నాగయ్య జిల్లా,మండల నాయకత్వంతో కలిసి గుడిస కేంద్రాన్ని సందర్శించారు.అనంతరం నిర్వహించిన సభలో నాగయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది ఇల్లు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఒక్కరికి కూడా సెంటు భూమి ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయలేదని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మిగులు భూములు 10 లక్షలకు ఎకరాలకు పైగా ఉన్నదని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వారందరికీ ఇంటి స్థలము,సాగు భూమికి రెండు ఎకరాలు చొప్పున పంపిణీ చేయడానికి అవకాశం ఉందని తెలియజేశారు.అనేక హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలందరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కనీసం మానవుడు జీవించడానికి గాలి,నీరు,కూడు,గుడ్డతో పాటు నిలువ నీడ కోసం ఇంటి స్థలము అవసరమని అన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న లక్షలాది మంది పేదలకు ఇంకా నిలువ నీడ లేకపోవడం చాలా ధారణమని ఆవేదన వెలిబుచ్చారు.కార్పొరేట్ శక్తులకు పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకు వందలాది ఎకరాలలో భవనాలు ఉంటున్నాయని పేదోడికి మాత్రం పూరి గుడిసె కూడా లేదని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జలాల్ పూర్ గ్రామం పాటు రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రతి ఒక్కరికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని నాగయ్య హెచ్చరించారు.తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ జలాల్ పూర్ గ్రామంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టా సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలని,వారందరికీ పట్టాలు ఇవ్వడానికి స్థానిక ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్,స్థానిక అధికారులు చొరవ చూపాలని కోరారు.పట్టా సర్టిఫికెట్ల కోసం ఈ నెల 25న పోచంపల్లి తశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలు గుడిసె వాసులతో పాటు మద్దతు దారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ డివిజన్ కార్యదర్శి గూడూరు అంజిరెడ్డి,సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి,పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్,సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ప్రసాదం విష్ణు,బి.ఆర్.ఎస్ నాయకులు గోరేటి ప్రదీప్ రెడ్డి,పాలకుర్ల ఆగయ్య పాల్గొని మాట్లాడగా ఇంకా గ్రామ ప్రజలు భాస్కర్,కృష్ణ,నరసింహ,పరమేష్,బాలయ్య,రంగయ్య,బాలరాజు,నరసింహ పాటు వందలాదిమంది గుడిసె వాసులు పాల్గొన్నారు.