
జగిత్యాల జూన్ 24 జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్
జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై అవగాహన కార్యక్రమాలు
డ్రగ్స్ నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని ఒక మంచి ఉదేశ్యంతో జిల్లా లో ఉన్న విద్యాసంస్థలలో ఉన్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.అందులో బాగంగా జిల్లా కేంద్రంలో గల మానస స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ముఖ్య అతిదిగా పాల్గొనడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,రాబోవు రోజుల్లో మాధకద్రవ్యాలను నిర్ములించేది నేటి తరం విద్యార్థులే అని అన్నారు. విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని,నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని ఎస్పీ సూచించారు.డ్రగ్స్ వాడడం అనేది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పాడుచేస్తుందని ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు.మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను కాపాడేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నరు. మత్తుకు బానిస అవడానికీ అనేక కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి నియంత్రణ కోసం మత్తు పదార్థాలను తీసుకోవద్దు అని, సన్నిహితుల ఒత్తిడితో చెడు మార్గాల వైపు అడుగు వెయ్యరాదు అన్నరు.డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు.మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత/విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని పెర్కొన్మారు.ఇక్కడ తెలుసుకున్న విషయాలను స్నేహితులకు,బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు,తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబధిత సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు.
అననంతరం మాదాక ద్రవ్యల వినియోగం వల్ల కలిగే అనర్థలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
మేము డ్రగ్స్ తీసుకొము,బంధుమిత్రులు ,చుట్టుపక్కల వారు ,స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం ” అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈ యొక్క కార్యక్రమం లో డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేశం మరియు డైరెక్టర్ శ్రీధర్ రావు,స్కూల్ ప్రిన్సిపల్ రజిత, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.