
ఒక ఆటో డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల స్లోకసంద్రంగా మారిన మూడు కుటుంబాలు
జన సముద్రం న్యూస్ జూన్ 24
(ఖానాపూర్ నియోజకవర్గం)
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లింగా పూర్ గ్రామానికి చెందిన అనిత (హేమలత) తమ తల్లి గారీ ఊరైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్ల గూడ గ్రామానికి కస్తూల పూరి గంగ లక్ష్మి వాళ్ళ ఇంటికి శుభకార్యం ఉన్నందున మూడు రోజుల క్రితం తన ఇద్దరు కుమారులతో వచ్చారు. ఆదివారం రోజున గంగ లక్ష్మి సంగీత అనిత (హేమలత) కుమారులతో కలిసి కలమడుగు గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వెళుతుండగా గ్రామం లోని సంధ్య వేణి లక్ష్మణ్ ఇంటిముందు కి వెళ్లేసరికి వీరికి ఎదురుగా వస్తున్న కలమడుగు గ్రామానికి చెందిన హనుమాడ్ల సత్తయ్య అను వ్యక్తి ఆటోను అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి రోడ్డుపై వెళ్తున్న గంగ లక్ష్మి సంగీత అనిత వారిపై బలంగా ఢీకొట్టగా అనిత తలకు తీవ్ర గాయాలు కాగా గంగా లక్ష్మి ఎడమ కాలు విరిగిందని కస్తుల పూరి గంగా లక్ష్మి కుమారుడు నరేష్ తెలిపారు గాయాలతో ఉన్న వారిని అంబులెన్స్ లో కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అనిత ఆదివారం రాత్రి అందాజా 9 గంటల ప్రాంతంలో మృతి చెందిందని. గంగా లక్ష్మికి మెరుగైన వైద్యం కోసం మెడికల్ హాస్పిటల్ లో చేర్పించామని గంగా లక్ష్మి కుమారుడు కస్తుల పురి నరేష్ తెలిపారు. అని జన్నారం ఎస్సై జి అనుష తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు హనుమాడ్ల సత్తన్న పై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని దర్యాప్తు చేయడం జరుపుతుంన్నామని జన్నారం ఎస్సై జి అనూష తెలిపారు