
జన సముద్రం న్యూస్ జూన్ 24
(ఖానాపూర్ నియోజకవర్గం)
ఆదివాసులు సాగు చేస్తున్న పొడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలి దానితోపాట ఆదివాసులు సాగు చేస్తున్న భూములలో కందకాలు తవ్వడం బాండ్రి పేరిట సాగు చేస్తున్న భూములను లాక్కోవడం సరైంది కాదని దీనిని తక్షణమే నిలిపివేయాలి. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ లు అన్నారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తకు వినతి పత్రాన్ని సమర్పించరు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం నాయకులు సిడం ధర్ము. దారేంగు ఎల్లయ్య. ఎనుముల నర్సయ్య. గోపి చంద్రయ్య. శంకర్. వాగ్మారే మహిళ సంఘం నాయకురాలు సంధ్య . ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ రాష్ట్ర నాయకులు వాగ్మారే సంభాజీ. తదితరులు పాల్గొన్నారు.