
-అనాధ శవానికి అంత్యక్రియలు
జనసముద్రం న్యూస్ జూన్ 24: డిండి :-
నల్లగొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి మండల కేంద్రంలో కొంతకాలంగా గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ,ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే గుర్తు తెలియని వ్యక్తికి ఫీట్స్ రావడంతో అంబులెన్స్ లో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందడం జరిగింది.అతని గురించి విచారించగా,అతనికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియకపోవడంతో డిండి పట్టణంలోనే పలువురు యువకులు సోమవారం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.ఆపత్కాలంలో ఆదుకునే,మానవతా దృక్పథం కలిగిన యువకులని వీరిని గ్రామ ప్రజలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో తండు చంద్రయ్య గౌడ్,బొల్లె శైలేష్,ఏ టి కృష్ణ,బాదమోని శ్రీనివాస్ గౌడ్,చింతపల్లి నరేష్,ఎండీ రషీద్,వావిల్లా అంజి యాదవ్, గుర్రం సురేష్,బుషిపాక గోవర్ధన్,ఎస్.కె మోహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.