
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 21
మహబూబాబాద్ మండలం నేతాజీ తండా వద్ద లారీ ఢీకొన్న ప్రమాదం లో గాయపడి ,హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను ఎమ్మెల్యే మురళీ నాయక్ పరామర్శించారు.
గాయపడిన గూగులోత్ శంకర్ ,భూక్యా శ్రీనివాస్ కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
శంకర్ అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో వెంటిలేషన్ పై చికిత్స పొందుతుడగా బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు.
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.