
జనసముద్రం న్యూస్ భీమారం జూన్ 21: భీమారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై భీమారం ఎస్సై కే. శ్వేత అవగాహన కల్పించారు, భీమారం ఎస్సై కే శ్వేత పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలకు వచ్చేటప్పుడు ప్రతి విద్యార్థి జాగ్రత్తగా రావాలని, రోడ్డు దాటేటప్పుడు వాహనాలను గమనించాలని ట్రాఫిక్ నియమనిబంధనలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన పెంపొందించుకోవాలని, విద్యార్థులు చిన్నప్పటినుండే శ్రమ శీలత ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించే విధంగా అలవాటు చేసుకోవాలని అన్నారు