
జన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం జూన్ 21 మెదక్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చిన్న శంకరంపేట మండలం మడూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులు ఉన్నాయని, దుస్తుల రాని పాఠశాలకు మరో వారం రోజుల్లో ఏకరూప దుస్తులు అందుతాయని అన్నారు.