తొర్రూర్ డివిజన్ జనసముద్రం న్యూస్ జూన్ – 18
అమ్మాపురం గ్రామంలో 1వ వార్డ్ లో గత నెల నుంచి విద్యుత్ విధి దీపాలు వెలగడం లేదు వీధి దీపాలు వెలుగక పోవడంతో వానకాలం కావడంతో రాత్రి సమయంలో పాములు, తేళ్లు లాంటి విష పురుగులు బయటికి వస్తున్నాయి. రాత్రి సమయంలో వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే గ్రామ ప్రజలు భయపడుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి విది దీపాలు వెలిగేలా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ..








