
—ఆనంద్ కుమార్ (మేడ్చల్ జిల్లా ఎసిబి డిఎస్పి)
—రామ్ రెడ్డి (కాంట్రాక్టర్ బాధితుడు)
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)
జనసముద్రం న్యూస్ కాప్రా జిహెచ్ఎంసి సర్కిల్ చర్లపల్లి ఏఈ గా పనిచేస్తున్న స్వరూప కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చర్లపల్లి ఏ ఈ స్వరూప….సీసీ రోడ్డు పనులకు సంబంధించి కాంట్రాక్టర్ రామిరెడ్డిని 1,50,000 డిమాండ్ చేయగా సర్కిల్ ఆఫీసులోనే స్వరూపకు అందజేయగా మేడ్చల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సదర్ కాంట్రాక్టర్ సిసి రోడ్ల పనులు పూర్తి చేసిన బిల్లులు రావడానికి ఏఈ స్వరూప లక్ష యాభై వేలు డిమాండ్ చేయగా కాంట్రాక్టర్ లక్ష ఇరవై వేలు ఇవ్వడానికే అంగీకరించాడు.ఏఈ స్వరూప వేధింపులు భరించలేక బాధితుడు కాంట్రాక్టర్ రామ్ రెడ్డి ఏసీబీ వారిని సంప్రదించాడు.లక్ష ఇరవై వేలు కాప్రా సర్కిల్ ఆఫీసులో ఏఈకి ఇవ్వగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసిబీ డిఎస్పి ఆనంద్ కుమార్ చెప్పారు.ఇంకా ఈ లక్ష ఇరవై వేల రూపాయలలో ఏ ఏ అధికారుల భాగస్వామ్యం ఉన్నవారిని వదలబోమన్నారు.గవర్నమెంట్ ఆఫీసులో అధికారులు లంచాలను డిమాండ్ చేస్తే మా ఏసీబీ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి సంప్రదించాలని చెప్పారు.