
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 21
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు కె .వి. ఎన్.ప్రభు కుమార్ , ఆదేశాలు మేరకు ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ.భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా లింగాపాలెం మండలం తివాచీలకారయుడుపాలెం గ్రామము, మట్టంగూడెం గ్రామము నకు చెందిన పెనమలూరు చంటమ్మ జెర్రిపోతుల మారేశ్వరావు మరియు చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామము నకు చెందిన దేశావతు వేణు ల వద్ద నుండి మొత్తం (40) లీటర్ల నాటు సారాయి సుజూకి బ్రెజ్జా కార్ నం: ఏపీ 40 ఏ వి 1989 లో రవాణా చేస్తుండగా స్వాధీన పరచుకొని , (200) లీటర్ల పులిసిన బెల్లపు ఊట ను ధ్వంసం చేసి, మరియు వీరికి బెల్లం సరఫరా చేసిన వ్యక్తి ఫాతిమాపురం గ్రామము నకు చెందిన అద్దంకి విశ్వేశ్వర రావు వద్ద నుండి (5) కేజీలు బెల్లం ను స్వాధీన పరచుకొని సదరు వ్యక్తి ను అదుపులోకి తీసుకొని , వారి నలుగురు పై కేసు నమోదు చేయడమైనది !