చింతూరు ఐటిడిఏ పరిధిలో ఆధార్ మేగా క్యాంపులు ప్రారంభం

Spread the love

జిల్లా ఇంచార్జి,జన సముద్రం న్యూస్, జూన్ 21

చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రత్యేక ఆధార్ మేగా క్యాంపులు నిర్వహించబడనున్నాయి. ఈ క్యాంపుల ప్రధాన ఉద్దేశం పీవీటీజీ కమ్యూనిటీలలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కల్పించటం, 100 శాతం నమోదుతో ఆధార్ సంతృప్తి స్థాయికి తీసుకురావడమే.

ఈ క్యాంపులో చింతూరు, యటపాక, కునవరం, వీ.ఆర్.పురం మండలాల్లోని గ్రామాలకు చెందిన ఆధార్ లేని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణ మరియ ఆధార్ అప్డేట్ సేవలు వంటి సేవలు ఈ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి.”సూచించారు.

ఈ సందర్భంగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బందికి సమన్వయం బాధ్యతలు అప్పగించబడినట్లు తెలిపారు. వారు గ్రామస్తులకు ఈ క్యాంపుల గురించి అవగాహన కలిపించి, ఆధార్ లేని వారు తప్పక క్యాంపుకు హాజరుకావలసిందిగా సూచించారు. ఆధార్ లేని వారు తమ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలు మరియు అవసరమైన ఆధారాలు క్యాంప్‌కు తీసుకురావలసి ఉంటుంది. ఈ క్యాంప్‌కి హాజరయ్యే ప్రతి ఒక పివిటిజి వారు డొమెసైల్ ప్రూఫ్ మరియు ఫోటో తప్పనిసరిగా తీసుకురావాలి దరఖాస్తు ఫారాలు ఐటిడిఏ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. మరియు
ఇటీవల PM JANMAN, ప్రాధాన్య గిరిజన అభివృద్ధి కార్యక్రమాల కింద ఆధార్ ఉండటం అవసరమైనదిగా ప్రభుత్వం నొక్కి చెబుతోందని, అందువల్ల ఆధార్ లేకపోవడం వల్ల పలు పథకాలకు దూరంగా ఉన్న గిరిజన కుటుంబాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ అపూర్వ భరత్ గారు ఐ ఏ ఎస్ వారు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘ సంస్కర్తలు సహకరించాలని కోరడమైనది.

ఈ మేగా క్యాంపులకు అవసరమైన సమన్వయం మరియు పర్యవేక్షణ బాధ్యతలను ఐటిడిఏ అధికారులు మరియు పిఎంయు (PMU) సిబ్బంది నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్యాంపులు ప్రజలందరికీ ఉపయోగపడేలా, అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్