
జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్. జూన్ 21
అల్లూరి సీతారామరాజు జిల్లా, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదరాళ్ల పంచాయతీ, బాలరేవుల గ్రామానికి చెందిన మెట్టడం రాజుబాబు (వయసు 31), తేనె కోసం చిరుమాను చెట్టెక్కిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
మొట్టడం రాజుబాబు తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జువ్వరేవుల కొండ ప్రాంతానికి తె 11-06-2025 దిన బుధవారం రాత్రి 8:00 గంటల సమయంలో తేనె పట్టు ఉన్నట్టు తెలుసుకొని వెళ్లారు. చెట్టెక్కిన సమయంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తల వెనుక భాగానికి బలమైన గాయం, నడుము భాగంలో గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే రాజుబాబును సహాయకులైన గ్రామస్తులు మెట్టడం పండు దొర, పోయివా నాగేశ్వరరావు, రామారావు, పలాస వెంకట్రావు లు ఆయనను ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భం తెలిసిన వెంటనే అతని అన్న మెట్టడం కృష్ణ అంబులెన్స్ సాయంతో రాజేంద్రపాలెం పి.హెచ్. సి.కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి, ఆ తర్వాత విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. అయితే.కెజి హెచ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, నిన్న అనగా 19-06-2025 వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో రాజుబాబు మృతి చెందినట్లు, ఈ ఘటనపై రాజుబాబు కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావిస్తున్నామని తెలుపుతూ మృతుని అన్న మంప పోలీస్ స్టేషన్.కు వెళ్లి ఫిర్యాదు చేయగా సదరు ఫిర్యాదు పైన మంప,పి. ఎస్ నందు శ్రీ కొయ్యూరు సి. ఐ. మరియు మంప ఎస్. ఐ ఆదేశాలు మేరకు ఎ. ఎస్. ఐ. జి. వి. ఎస్. సుబ్రహ్మణ్యం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.