
తహసీల్దార్ నటరాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
జనసముద్రం న్యూస్ చిలమత్తూరు జూన్ 21
చిలమత్తూరులోని రెవెన్యూ భవన్‌లో రెవెన్యూ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో 1786లో తొలిసారిగా బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఆవిర్భావం పురస్కరించుకుని ఏటా జూన్ 20న జరుపుకునే రెవెన్యూ దినోత్సవాన్ని శుక్రవారం చిలమత్తూరులోని రెవెన్యూ మండలం నుంచి రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు.స్థానిక తహసీల్దార్ నటరాజన్ చేతుల మీదుగా వారికి శాలువాలతో,పూలమాలలతో, పుష్ప గుచ్చలతో ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను జూన్ 20 నా సన్మానించుకోవాలని సూచించింది.రెవెన్యూశాఖ చరిత్ర, విశిష్టతను ఎప్పటికప్పుడు ప్రజలకు మరిన్ని మంచి సేవలను అందించేలా చట్టాలపై విస్తృత అవగాహన ఉండాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘ కార్యదర్శి ,రాష్ట్ర ఉపాధ్యక్షులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ ఉద్యోగులు సరిహద్దులో సైనికునివలే అలుపెరుగని సేవలను ప్రజలకు అదించాలన్నారు.రెవెన్యూ ఉద్యోగులకు చట్టాలపై అవగాహన కోసం చిలమత్తూరు మండలంలో త్వరలోనే శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కృషి జరుగుతోందన్నారు. ఉద్యోగకాలంలో అత్యుత్తమ సేవలందించిన రిటైర్డ్ తహసీల్దార్ జయరాం,విఆర్ఓ ప్రభాకర్,గ్రామ రెవెన్యూ అధికారులు, వార్డు రెవెన్యూ కార్యదర్శులు, గ్రామ సర్వే సహాయకులు పాల్గొన్నారు.