
ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూన్ 18: భారతదేశ కీర్తిని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు అధ్యక్షతన మంగళవారం ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి గ్రామంలో ప్రధానమంత్రి 11 సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది
ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు ప్రపంచ దేశాల్లో భారత దేశ గౌరవాన్ని ఆయన ఇనుముడింపజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ఢిల్లీ నుంచి గ్రామస్థాయి వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారు ముఖ్యంగా మహిళలకు డ్వాక్రా గ్రూపులు ద్వారా ప్రధానమంత్రి గారు లకపతి అనే ఒక పథకం కింద ప్రతి ఒక్కడ్వాక్రా మహిళ ఈ దేశంలో ఒక లక్షాధికారి కావాలి అనే ఉద్దేశం ప్రధాని దన్నారు మీ వాళ్ళు ఎవరైనా కూడా ఏమైనా ఒక వ్యాపారము ఒక చిన్న కుటీర పరిశ్రమ చేయాలనుకున్న ఒక ఆటో ఏమైనా కొనాలనుకున్నా కూడా మీకు మీ డ్వాక్రా గ్రూపుల ద్వారా మీకు లోన్లు కూడా అందించడం జరుగుతుంది ఇటువంటివి అనేక పథకాలుఅమలు చేస్తున్నారు రైతు భరోసా ఇ స్తున్నాము మీకు రైతు భరోసా రెండు విధాలు
వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీకు 6000 రూపాయలు ఇస్తున్నారు
ఈ కార్యక్రమంలో కార్యక్రమాలకు కన్వీనర్ చీర్ల శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ రామ్ జగదీష్ స్వామి రాష్ట్ర మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మృగరాజు రమణయ్య రాజంపేట పట్టణ అధ్యక్షులు రమణయ్య సీనియర్ బిజెపి నాయకులు వెంకట రామరాజు ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ వెంకటపతి తదితరులు పాల్గొన్నారు సభలో మహిళలు అత్యధికంగా పాల్గొనడం పట్ల జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ ను అభినందించారు పార్టీ ఇంకా కృషి చేయాలని మండలంలో ఆయన తెలియజేశారు