మృతుని కుటుంబానికి అండగా నిలిచిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
జనసముద్రంన్యూస్, జూన్ 15, కారంపూడి , పల్నాడు జిల్లా ;
పల్నాడు జిల్లా లో మండల కేంద్రమైన కారంపూడిలో ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ఇమ్మడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. రామకృష్ణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. నిరుపేద కావడంతో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని కారంపూడి ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుసుకొని ఆయన కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దహన సంస్కారులకు 13000 అందించి కుటుంబ పోషణ కోసం మరో 10 వేల రూపాయలను భార్యకు రామకృష్ణ కు ఇద్దరు చిన్నారులు ఉండటంతో వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ మరో 50,000 ఇవ్వటానికి ఆర్యవైశ్య పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా మృతుని తల్లికి 10వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. మొత్తం 87 వేల రూపాయలు ఆర్యవైశ్య సంఘం నాయకులు మృతుని కుటుంబానికి సహాయం అందజేశారు.వారికి మనోధైర్యం కల్పించి తోడుగా ఉంటామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు మద్దు హనుమంతరావు మాజీ అధ్యక్షులు చీతిరాల వెంకట కోటేశ్వరరావు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎస్పిఆర్ కృష్ణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల సాయి శ్రీ వాసవి అన్నప్రసాద కమిటీ ఫౌండర్ భవిరి శెట్టి రామారావు ఆర్యవైశ్య నాయకులు భవిరిశెట్టి పూర్ణచంద్రరావు, కొత్త నరసింహారావు, కంభంపాటి సత్యనారాయణ, మిత్తింటి సాంబశివరావు, కాసుల శ్రీనివాసరావు, కొలిశెట్టి మల్లికార్జునరావు, కజ్జం పెద్ద ఆంజనేయులు, వెచ్చ వాసు, ఆతుకూరి గోపి, ఊటుకూరి రాము, కొమ్మూరి శ్రీనివాసరావు, మిట్టపల్లి నాగేశ్వరరావు, కర్నాటి మహేష్, చేపూరి రవీంద్ర, వెచ్చ ఉమా మహేష్, కర్నాటి గోపాలకృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.





