జనసముద్రం రాయచోటి వీరబల్లి 20మే
వీరబల్లి ఎస్ఐ గా జె.నరసింహా రెడ్డి సోమవారం వీరబల్లి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అన్నమయ్య సైబర్ క్రైమ్ సెల్ నుంచి బదిలీ పై వీరబల్లి కి వచ్చారు. ఈయన గతంలో సుండుపల్లి, రాయచోటి ఎస్ఐ గా పని చేశారు. రాయచోటి లొ పనిచేసేటప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టిన ఘనత నరసింహారెడ్డి కె దక్కుతుంది ఈ సందర్భంగా ఎస్ఐ జె.నరసింహా రెడ్డి మాట్లాడుతూ వీరబల్లి మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణ కోసం పనిచేస్తానని, అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు.





