
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాం
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్30)
జనసముద్రం న్యూస్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోమవారం రోజున దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి శ్రీధర్ వివరాలను మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదు దారుడు,అతని కార్యకర్తలను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్సై పరశురాం నాయక్ 2 లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు.దీంతో ఫిర్యాదుదారుడు ఈనెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు.అప్పటికే 21వ తేదీన 2 లక్షలు లంచం తీసుకున్నాడని,శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై పరశురాం కారులో ఇవ్వగా మరోసారి ఫోన్ చేసి అదనంగా మరో 25 వేలు కావాలని డిమాండ్ చేయగా,ఫిర్యాదుదారుడు 22వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు.సోమవారం రోజున మరో 22 వేల రూపాయలు పోలీస్ స్టేషన్ లో ఇవ్వడానికి లంచం ఇవ్వగా ఎస్సై పరశురాం ఆదేశానుసారం పోలీస్ స్టేషన్లోని చెత్తబుట్టలో వేసి వెళ్ళిపోవాలని ఎస్సై ఫిర్యాదుదారునికి సూచించారని చెప్పారు.ఎస్సై ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడు చిత్తబుట్టలో వేసి వెళ్ళిపోగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎస్సై పరశురామ్ ను పట్టుకున్నామన్నారు.దీంతో ఎస్సై పరశురాంపై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడుగుతే 1064 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లేదా వాట్సాప్ నెంబర్ 9440 446106 సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు.