
అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా మొక్కలు నాటాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని కాన్ఫరెన్స్ హాల్ నందు అటవీశాఖ,ఎన్ హెచ్ ఎ,ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్ శాఖ,వివిధ శాఖల అధికారులతో 2025 సంవత్సరమునకు మొక్కలు నాటే కార్యక్రమం పై ముందిస్తూ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో,దేవాలయాలు,చర్చిలు,మసీదులు,చెరువు గట్లపై,బంజారా భూములు, మొదలైన ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని
సంస్థాగతంగా నాటేందుకు ఎన్ని మొక్కలు అవసరమో జాబితాను డీఎఫ్ఓకు సమర్పించాలి.మీకు ఎంత అవసరమో
ప్లాంటేషన్‌ను సాధించడానికి ఒక వారంలోపు సైట్‌లను గుర్తించడం.అధికారులను ఆదేశించారు.32 మండలాలకు చెందిన మండల ప్రత్యేక అధికారులు మరియు సంబంధిత శాఖల హెచ్‌ఓడీలకు డి ఎఫ్ ఓ జాబితాన సమర్పించాలని తెలిపారు.174065 హెక్టార్ల భూమి నందు 10 లక్షల 43 వేల మొక్కలు నాటాలని తెలిపారు,మునగ,కరివేపాకు, నిమ్మ, దానిమ్మ,మొదలైన మొక్కలను కూడా నాటాలని తెలిపారు,జాతీయ రహదారుల వెంట విరివిగా మొక్కలు నాటాలని అందుకు జాతీయ రవాణా అధికారులు ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.పవర్ ప్రజెంటేషన్ను తిలకించారు.
డి ఆర్ డి ఏ,బి డబ్ల్యు ఎం ఎ పంచాయతీరాజ్ శాఖ, పరిశ్రమల శాఖ,వ్యవసాయ అనుబంధ రంగాల అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి డి నరసయ్య,డిపిఓ సమత, జిఎం ఇండస్ట్రీ నాగరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.