
యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
చొప్పదండి మండల కేంద్రంలో శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు… జై భీమ్…. జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్ తో పాటు పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే సత్యం క్యాంప్ ఆఫీస్ వద్ద ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు నుంచి గాంధీ విగ్రహం వరకు వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వీధుల గుండా ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా అంబెడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. అంబేడ్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పహల్గాం టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారికి సంతాపకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ ర్యాలీకి మండలంలోని పలు గ్రామాలకు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, మహిళలు భారీగా హాజరయ్యారు.