
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 29
మహబూబాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) కే.వీరబ్రహ్మచారి, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఐకెపి, పౌరసరఫరాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, రవాణా సంబంధిత అధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచాలని సెంటర్లలో అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని, ప్యాడి క్లీనర్ ఎలక్ట్రానిక్ సంబంధిత మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని, సూచించారు
కేంద్రాల నిర్వహణ రైతులకు సౌకర్యాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కొనుగోలు జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు,
ఈ సమావేశంలో డిసిఓ వెంకటేశ్వర్లు, డీఎస్ఓ ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డిహెచ్ఎస్ఓ మరియన్న, వ్యవసాయ శాఖ ఏడి ఏ మురళి, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, మెప్మా విజయ, నలిని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.