
జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 26 : డిండి :-
నల్లగొండ జిల్లా(గుండ్లపల్లి) డిండి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ సమీపంలో గల చెట్లపొదల్లో గుర్తుతెలియని మగ శవాన్ని శుక్రవారం కనుగొన్నట్లు డిండి పోలీసులు తెలిపారు.సుమారుగా వయస్సు 45 నుండి 50 సంవత్సరాలు ఉంటుందని మృతుని ఒంటిపై గోధుమ రంగు షర్టు బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు,తలకు టవల్ చుట్టుకుని ఉన్నట్లు తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తము దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు నేరేడుగొమ్ము ఎస్సై (డిండి ఇంచార్జ్ ) మరియు డిండి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వ్యక్తులు 87126755 44, 8712640223,8712670155 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని పోలీస్ వారు తెలిపారు.