కామేపల్లి జనసముద్రం ఏప్రిల్ 26:
వరంగల్ లో ఈనెల 27వ తేదీన జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాది గా తరలిరావాలని మండల బిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం మండలంలోని జాస్తి పల్లి గ్రామంలో జరిగిన ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశం మల్లెంపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు అంతోటి అచ్చయ్య, మూడు కృష్ణ ప్రసాద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సభకు గ్రామాల నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల నాయకులు వడియాల కృష్ణారెడ్డి, సామ మోహన్ రెడ్డి,తూము బాబు ,ఆదూరి ప్రసాద్, చిప్పులపల్లి శ్రీనివాస్, గుజ్జర్లపూడి సత్యనారాయణ, పగడారపు రామ్మూర్తి, బట్టు శంకర్, రాంబాబు, శేట్టి సంతోష రావు, ముత్యం రామకృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





