
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23ఏప్రిల్
తేదీ: 22- 4- 2025 రోజున ఫిర్యాది తన సిబ్బందితో టౌన్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కోరపల్లి రోడ్డు వద్ద ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ వద్దకు చేరుకోగానే ప్రతివాదులు అయిన ముంజాల సాయికుమార్ తండ్రి: భద్రయ్య వయసు: 24 గ్రామం: విలాసాగర్ అను అతను తన ట్రాక్టర్ నెంబర్ అయినTS-02-EE-5689 అక్రమంగా ఇసుకను ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తూ ఉండగా పట్టుకొని ముంజల సాయికుమార్ పై కేసు నమోదు చేసిన చేసినట్లు జమ్మికుంట (టౌన్) సి.ఐ వరంగంటి రవి తెలిపారు.