
ఫోన్ లొకేషన్ ఆధారంగా మిస్సింగ్ కేసు ను ఛేదించిన పోలీసులు.
జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 ఏప్రిల్
తేదీ: 22- 4- 2025 రోజున పొన్నగంటి దివ్య భర్త: రవికుమార్ వయసు: 32 మున్నూరు కాపు గ్రామం: మోతుకుల గూడెం అను ఆమె జమ్మికుంట పి.ఎస్ కి వచ్చి తన భర్త అయిన పొనగంటి రవికుమార్ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో నుండి వెళ్లిపోయినాడు.
ఈ విషయం పై తేదీ:10-4-2025 న ఫిర్యాదు ఇవ్వగా జమ్మికుంట పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు చేయడమైనది. పొనగంటి రవికుమార్ ఇంట్లో నుండి వెళ్లిపోయి జమ్మికుంట నుండి హైదరాబాద్ కు వెళ్లి అక్కడ నుండి కడపకు వెళ్లి కడపలో ఉన్న కాశీనాయన ఆశ్రమంలో 11 రోజులు ఉండి తర్వాత తన భార్య పిల్లలు గుర్తుకు వచ్చి అక్కడ ఉన్న వారి ఫోన్ తో తన భార్యకి ఫోన్ చేయగా ఇట్టి విషయం ఫిర్యాది పొనగంటి దివ్య జమ్మికుంట టౌన్ సిఐ కి తెలుపగా స్పందించిన సిఐ వరంగంటి రవి ఆ ఫోన్ నెంబర్ యొక్క లొకేషన్ పెట్టి అడ్రస్ తీయగా నంద్యాల అని రాగా ఫిర్యాది మరియు తన కుటుంబ సభ్యులు కలిసి నంద్యాలకు వెళ్లి మిస్సింగ్ అయిన పొనగంటి రవి కుమార్ ను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో తన కుటుంబ సభ్యులకు అప్పగించినారని జమ్మికుంట సర్కిల్ ఇన్ స్పెక్టర్ వి.రవి తెలిపినారు.