జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23,
జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ ఉండి పారి పోవుటకి ప్రయత్నం చేయగా ఎస్ఐ తన సిబ్బంది తో చాక చక్యంగా పట్టుకుని విచారించగ రెండు మోటార్ సైకిళ్ళ పైన ఉన్న నలుగురీ జునోజు రాజేష్ గాంధీనగర్- పోనకల్ జన్నారం, సయ్యద్ సమీర్, గాంధీనగర్- పోనకల్ జన్నారం, ఆకుల బాలాజీ రేండ్లగూడ-మందపెల్లి జన్నారం, ఎనగందుల వినయ్ గాంధీనగర్ పోనకల్ జన్నారం అని తెలిపి గంత కాలంగా గంజాయి తాగుటకి అలవాటు పడి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వినయ్ కి తెలిసిన కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ప్రాంతానికి చెందిన అను వ్యక్తి దగ్గర 5000 రూపాయలకి కిలో పావు గంజాయి కొని జన్నారం మండలంలో చుట్టూ ప్రక్కల గ్రామమలలో అవసరం ఉన్న వారికి ఎక్కువ రేట్ కి అమ్ముటకి రవాణా చేయుచుండగా పట్టుకుని సి ఆర్ నెంబర్ 77/2025, యు సెక్షన్ 8 సి, ఆర్ డబ్ల్యూ 20 బి, టు బి 27 ఏ ఆప్ ఎన్ డి పి ఎస్ యాక్ట్ -1985 ప్రకారం జన్నారం పోలీస్ స్టేషన్ యందు ఎస్ఐ రాజ వర్ధన్ కేసు నమోదూ చేశారు.
నేరస్తుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నవి, ఒక కిలో 20 గ్రాముల నిషేదిత గంజాయి దాని విలువ 50 వేలు రూపాయలు, ఏ1 దగ్గర హోండా షైన్ మోటార్ సైకిల్, ఏ3 దగ్గర హోండా ఆక్టివా స్కూటీ నలుగురు నిందితుల నాలుగు సెల్ ఫోన్ లు ఈ నిషేదిత గంజాయిని తరలిస్తున్న నెరస్తులను పట్టుకున్న ఎస్ ఐ రాజ వర్ధన్ ను హెచ్ స్సీ తుకారాంను, ఎండి గౌస్ ను సురేష్ ను , మల్లేష్ శ్రీను, సంతోష్, వెంకటేష్ లను మంచిర్యాల డిసిపి అభినందించారు.