
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చ్ 04
హాల్ టికెట్ విద్యార్థుల దగ్గర దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతవత్ రవీందర్ టి ఎస్ ఎస్ ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి వెంకటేష్ లు సోమవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తాకట్టులో పెట్టేలా కొన్ని ప్రైవేటు కళాశాలలో వ్యవహరిస్తున్న తీరును భయంకరంగా మారుతుంది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఉచిత విద్యా పేరుతో మోసపూరిత వ్యూహాలు రచిస్తున్న కళాశాలల యజమాన్యులు పరీక్ష సమయం వచ్చినప్పుడు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని తక్షణమే ప్రాధాన్యతగా తీసుకొని ఈ దోపిడీని తక్షణమే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.