
యాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)
జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం మహాదేవపురంలోని అక్కన్న మాదన్న ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అభిషేకం,అర్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అంతకుముందు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.బ్రహ్మోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.ఆలయంలో భజన సంకీర్తనలు శ్రీ రామలింగేశ్వర భజన మండలి కొండమడుగు వారిచే అర్ధరాత్రి నుండి తెల్లవార వరకు భజనలు చేసినారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కవాడపు శివారెడ్డి,ధర్మకర్తలు దండెం ప్రభాకర్,దండెం రవీందర్,కందాడి రవణమ్మ,నగేష్,జస్వంత్ సింగ్,కొండల్,ఈవో రుద్ర వెంకటేశం,నాయకులు గోలి పింగల్ రెడ్డి,పొట్టోల శ్యామ్ గౌడ్,మెట్టు శ్రీనివా స్ రెడ్డి,ఎంపిడివో శ్రీనివాస్ రెడ్డి,నాయకులు సురకంటి సత్తిరెడ్డి,గడ్డం బాలకృష్ణ గౌడ్,ఎరుకల సుధాకర్ గౌడ్,ఆకుల ప్రభాకర్,గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్,కందాడి వెంకట్రాంరెడ్డి,వేణుగోపాల్,స్వామి రెడ్డి,శ్రీనివాస్,స్వామి గౌడ్,జహంగీర్,కృష్ణ,సురేందర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,ఆంజనేయులు గౌడ్,అశోక్,అఖిల్,సంజీవ తదితరులు పాల్గొన్నారు.