
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28 మెదక్ జిల్లా
చిన్న శంకరంపేట మండలం పరిధిలోని రుద్రారం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కామేశ్వర సంగమేశ్వర స్వామి 76వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామ యువకులు టీములుగా ఏర్పడి కుల మతాలకు అతీతంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి గ్రామ యువకులను అభినందించిన ఎస్సై అనంతరం వారు మాట్లాడుతూ నేరాలను తగ్గించడానికి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి ఆలోచనతో క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ఏర్పాటుచేసిన ఆర్గనైజేషన్ రూంజ పాషా ఆకుల ప్రవీణ్ మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఉప సర్పంచ్ ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.