జన సముద్రం న్యూస్,పినపాక,అక్టోబర్30.
గిరిజన యువత క్రీడలపై మక్కువ చూపాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని సుందరయ్య నగర్, ఎర్రగుంట ఆదివాసి యువకులకు వాలీబాల్ కిట్ ను ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్ కుమార్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ యువత ప్రక్కదోవ పట్టకుండా ఆటలపై మక్కువ పెంచుకోవాలని తెలిపారు. ఆటలు ఆడటం వలన శరీర దృఢత్వం, మానసిక ఉత్సాహం కలుగుతుందని, ముఖ్యంగా యువత దురలవాట్లకు బానిస కాకుండా అసాంఘిక శక్తుల వైపు తమ దృష్టిని మరల్చకుండా ఉండటం మూలాన తమ అమూల్యమైన జీవితాన్ని కోల్పోకుండా ఉంటారని, విద్యారంగం, క్రీడారంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని తమ కుటుంబానికి, గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆదివాసీ యువత పాల్గొన్నారు.