యువతకు ఆటల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం : సీఐ వెంకటేశ్వర్లు.

Spread the love

జన సముద్రం న్యూస్,పినపాక,అక్టోబర్30.

గిరిజన యువత క్రీడలపై మక్కువ చూపాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని సుందరయ్య నగర్, ఎర్రగుంట ఆదివాసి యువకులకు వాలీబాల్ కిట్ ను ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్ కుమార్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ యువత ప్రక్కదోవ పట్టకుండా ఆటలపై మక్కువ పెంచుకోవాలని తెలిపారు. ఆటలు ఆడటం వలన శరీర దృఢత్వం, మానసిక ఉత్సాహం కలుగుతుందని, ముఖ్యంగా యువత దురలవాట్లకు బానిస కాకుండా అసాంఘిక శక్తుల వైపు తమ దృష్టిని మరల్చకుండా ఉండటం మూలాన తమ అమూల్యమైన జీవితాన్ని కోల్పోకుండా ఉంటారని, విద్యారంగం, క్రీడారంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని తమ కుటుంబానికి, గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆదివాసీ యువత పాల్గొన్నారు.

  • Related Posts

    చదువుల తల్లి, సంఘసంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు,

    Spread the love

    Spread the loveక్రాంతి జ్యోతి, సావిత్రిబాయ పూలే ముంజాల రాజేందర్ గౌడ్ సావిత్రి భాయి పూలే 194 వ జయంతి( జనవరి 3 ) మహిళా ఉధ్యాయ దినోత్సవం గా జరుపుకుందాం. మహాబూబబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జనవరి…

    జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజురాబాద్ సిఐ

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి // హుజురాబాద్) జనసముద్రం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను హుజురాబాద్ నియోజక వర్గం టౌన్ సిఐ జి తిరుమల్ ఆవిష్కరించారు.హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో జనసముద్రం న్యూస్ కరీంనగర్ సబ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చదువుల తల్లి, సంఘసంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు,

    చదువుల తల్లి, సంఘసంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు,

    ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!

    ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!

    జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజురాబాద్ సిఐ

    జనసముద్రం న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజురాబాద్ సిఐ

    అదుపుతప్పి లారీని ఢీకొన్న నాగార్జున పాల డైరీ వ్యాన్

    అదుపుతప్పి లారీని ఢీకొన్న నాగార్జున పాల డైరీ వ్యాన్