జనసముద్రంన్యూస్, పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణం, అక్టోబర్26.
మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ లోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ‘మైబీ’ బేకరి & రెస్టారెంట్ ను మాచర్ల మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రెండు, మూడు రోజులు నిల్వ ఉంచిన పదార్థాలను మరియు బూజు పట్టిన పదార్థాలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు రేపటి నుండి ప్రతిరోజు ఈ రెస్టారెంట్ ను అధికారులు తనిఖీ చేస్తారని యజమాని కి గట్టిగా చెప్పడం జరిగింది. ఇలాంటి పాడైపోయిన పదార్థాలను అమ్మి ఎంతమంది ప్రాణాలను తీయాలనుకుంటున్నారు అని రెస్టారెంట్ యజమాని ని అడగటం జరిగింది. ఈ తనిఖీ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.