జిల్లా ఎస్పీ ఆదేశాలతో, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వ్యాసరచనలు, వకృత్వ పోటీలు..*
రాయచోటి- జనసముద్రం దినపత్రిక
అక్టోబర్ 26:
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, పోలీసు హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ పోలీసులకు “పర్యావరణ పరిరక్షణలో పోలీసులకు సవాళ్లు” అనే కార్యక్రమం పై, వ్యాసరచన, వకృత్వ పోటీలు పోలీసు అధికారులు నిర్వహించారు. పోలీసు వారు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు.
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా, ఏఆర్ డిఎస్పీ. శ్రీ.బి.చిన్నికృష్ణ గారు, వ్యాచరచన/ వకృత్వ పోటీలను పర్యవేక్షించారు..ఈ కార్యక్రమంలో ఆర్ఐ (అడ్మిన్) వి.జే.రామకృష్ణ గారు, పలువురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు, శ్రీ. ఎస్. ఆంజనేయులు, శ్రీమతి. బి.ఎస్.పద్మావతి, శ్రీ.పి. రాజా, శ్రీ. ఎన్. హరీపుల్లా ఖాన్, శ్రీ. ఎస్. సజ్జధ్ గారు, ఆర్ ఎస్ఐలు, బి. అమరనాథ్ రెడ్డి, జి.రవి. ఎస్. అల్లాఉద్దీన్, జే.హజరతయ్య గారు, సివిల్, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.