మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి..

Spread the love

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు

( జనసముద్రం న్యూస్ కరీంనగర్)

ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కి గురువారం నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సరిల్ల రతన్ రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దివంగత నేత జగపతి రావు గారి విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించి అనుమతి ఇవ్వాలని కోరారు.

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా తాము మీ ప్రతిపాదన తమరికి సమర్పిస్తున్నామని వివరించారు , వెలిచాల జగపతి రావు గారు, 1972 నుంచి 1977 వరకు జగిత్యాల నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా, మరియు 1978 నుండి 1984 వరకు శాసనమండలి సభ్యులుగా పనిచేశారని తెలిపారు. 1989 నుండి 1994 వరకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభ్యుడిగా పనిచేశారని వివరించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించారని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఆయన్ను ప్రజాబంధుగా గౌరవించారని, పేదల కోసం నిరంతరం హరితపించిన మహా నేత జగపతిరావు అని వివరించారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదేని యోగ్యమైన ప్రదేశంలో కరీంనగర్ ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన మహా నాయకులు జగపతిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు.

వినతి పత్రం ఇచ్చిన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గండి రాజేశ్వర్, మాజీ నగర ప్రధాన కార్యదర్శి సరిళ్ళ రతన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండి శ్యామ్, పులి నరసింగం, కాసారపు కిరణ్, గండి గణేష్, పెద్ది రవి తదిరులు ఉన్నారు.

  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు