నలుగురిపై కేసు నమోదు
చొప్పదండి(జనసముద్రం న్యూస్):
సోమవారం ఉదయం చొప్పదండికి చెందిన ఎలిగేటి నాగరాజు, పబ్బ శ్రీనివాస్ మరియు బొల్లం జగదీష్ అను వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు విక్రయించుటకు నిల్వ ఉంచారని, ఇట్టి బియ్యాన్ని మంచిర్యాలకు తరలించడానికి బొలెరో పికప్ వాహనంలో లోడ్ చేసారని, ఇట్టి విషయాన్ని టాస్క్ ఫోర్స్ కరీంనగర్ పోలీసులు గుర్తించి వారి దగ్గర నుంచి సుమారుగా 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని వాహనంతో సహా పట్టుకున్నారు. మరియు పబ్బ శ్రీనివాస్ ఇంటి లోపల మరొక బియ్యపు నిల్వ ఉన్నదన్న సమాచారంతో ఇంట్లో తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10 క్వింటాళ్ల బియ్యంతో పాటు ముందుగా పట్టుకున్న 40 క్వింటాల్ల వాహనాన్ని అదుపులోకి తీసుకుని స్థానిక చొప్పదండి
పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న బొల్లం
జగదీష్ పబ్బా శ్రీనివాస్ ఎలిగేటి నాగరాజు తోపాటు మరియు వాహన డ్రైవర్ దాసరి నవీన్ పైన కేసు నమోదు చేయడం జరిగింది