జనసముద్రం న్యూస్, అక్టోబర్06 బ్యూరోచీఫ్:
వాల్మీకి రామాయణంలో సూర్యవంశగురు తుల్యులైన వశిష్ట మహర్షికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదోభక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రామక్షేత్రంలో ఆస్థాన పురోహితునికి అంతేప్రాధాన్యం ఉన్నది.
భద్రాచలం రామాలయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో ఆస్థాన పురోహితులే నిర్ణయించడం భక్త రామదాసు గారి కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది.
సుప్రభాతంతో మేల్కొలిపి నశ్రీరామునికి పంచాంగ శ్రవణం ద్వారా ఆనాటి పంచాంగ విశేషాలను ఆస్థాన పురోహితులు తెలియజేస్తారు. పంచాంగ శ్రవణంతోనే శ్రీరాముని నిత్య పూజా కైoకర్యాలు మొదలవుతాయి.
అనంతరం మూల విరాట్కుజరిగే అభిషేకం సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన మొదలుకొని స్వామివారినిత్య కళ్యాణం వరకు జరిగే నిత్య కైంకర్యాలలో ఆస్థాన పురోహితులే ప్రధాన పాత్ర పోషించేవారు.
శ్రీరామ నవమికి స్వామివారి కళ్యాణం, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో కూడా ఆస్థాన పురోహితులే నేతృత్వం వహించి కార్యక్రమాలు నిర్వహించేవారు.
రామాలయం ఆస్థాన పురోహితు నిగా స్వర్గీయ బ్రహ్మశ్రీ చల్లా కోదండరామయ్య శర్మ గారు బాధ్యతలు నిర్వహించినంత వరకు స్వామి వారి కైoకర్యాలు పైన తెలిపిన విధంగా నడుస్తుండేవి. కోదండరామయ్య శర్మ గారి అనంతరం వచ్చిన ఆస్థాన పురోహితుని పక్కన పెట్టిన అర్చకేతరులైన దేవాలయ సిబ్బంది ఒకరిద్దరు ఆస్థాన పురోహితునిపోస్టుపిల ప్ కాకుండా అడ్డుకున్నారు.
2022 జూన్ నెలలో నియమించవలసిన ఆస్థాన పురోహితుని పోస్టును 2 సంవత్సరాల మూడు నెలలు కాలం గడచినప్పటికీ నేటికీ ఆస్థాన పురోహితుని పోస్టు ఫిలప్ చేయలేదు. గత10 సంవత్సరాలుగా రామాలయం నకు ట్రస్ట్ బోర్డు రాకుండా ఈ ప్రబుద్ధులే అడ్డుకున్నారని గతంలో వినిపిస్తుండేది.
నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఆస్థాన పురోహి తుని పోస్ట్ నింపకపోవడం శ్రీరామ భక్తులను కలచి వేస్తోంది.
కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహితున్ని వెంటనే నియమించాలని ప్రజలు కోరుతున్నారు.