అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మహాగౌరయోత్ అసోసియేషన్ సభ్యులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ 06:
దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ లోని నాగార్జున కాలనీ ఫస్ట్ లైన్ లో మహాగౌరి యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారికి మూడవరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భవాని మాల వేసుకున్న వారితో పాటు, సుమారు వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహా గౌరి యూత్ అసోసియేషన్ సభ్యులు ఎస్ రేవంత్ రెడ్డి, సిహెచ్ మాదేష్, ఎం జస్వంత్, జి విక్రమ్, ఎం కార్తీక్, ఎస్ సాయికిరణ్, వి అంజన్, వి సాయి, కే సాయి, టి ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, కె సంతోష్, ఎస్ మల్లారెడ్డి, ఎస్ నరసింహారెడ్డి, బి శ్రీనివాస్, కే రామ్మూర్తి చారి, ఎం బాబు నాగ శ్రీనివాస్, డి శశి వత్సల్, రాందాస్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.