జనసముద్రంన్యూస్, అక్టోబర్ 06, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, కారంపూడి.
పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఆధ్వర్యంలో
శనివారం దాతలు వందన రామాంజనేయులు ధర్మపత్ని భాగ్యలక్ష్మి , గుండా నాగేశ్వరావు ధర్మపత్ని నిర్మల, కరాలపాటి శ్రీనివాసరావు ధర్మపత్ని లీలావతి, గొంట్ల వెంకట రాజేష్ ధర్మపత్ని మానస , కొమ్మూరి రామారావు ధర్మపత్ని స్వరాజ్యలక్ష్మి , మండవ పానకాలు (లేటు) ధర్మపత్ని హనుమాయమ్మ వీరి సహకారంతో 500 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగినది. ఈ అన్న ప్రసాద నారాయణ సేవ కార్యక్రమంలో జిల్లా వాసవి క్లబ్ వైస్ గవర్నర్ భవిరిశెట్టి రామారావు, అయినవోలు నరసింహారావు, కొమ్మూరి కిషోర్, గుండా కిరణ్, మండవ రత్నాకర్ ధర్మపత్ని మల్లేశ్వరి, మహిళా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి చిన్ని లక్ష్మి , మండవ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.