జనసముద్రం న్యూస్ హుస్నాబాద్,సెప్టెంబర్ 25:
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును తెలంగాణ భవన్ హైదరాబాద్ లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహం పార్టీకి క్యాడర్ ను చేయాల్సిన సమాయత్తంపై మాజీ మంత్రి కేటీఆర్ తో చర్చించినట్లు మాజీ ఎమ్మెల్యే సతీష్ తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గం లో ఎక్కువ మంది పట్టభద్రులను ఎన్రోల్ చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విధంగా పనిచేయాలని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని పలు కీలక అంశాలను మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు.