వారు వద్ద నుండి 4 కార్లు, రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం.. ఆర్ ఎస్ ఏ ఎస్ టి ఎఫ్.. !!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 25 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ ప్రాంతంలోని ప్రవేశిస్తున్న 15మందిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ డి. మురళీధర్ సూచనలతో ఆర్ ఎస్ ఐ సురేష్ బాబు సుండుపల్లి నుంచి కొలిమిమిట్టా వైపు స్థానిక అటవీశాఖ అధికారులతో కలసి కూంబింగ్ చేపట్టారు. అక్కడ కొంతమంది నాలుగు కార్ల లో దిగుతూ కనిపించారు. వారిని హెక్కరించి చుట్టుముట్టగా, వారిలో కొందరు పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 15 మందిని పట్టుకున్నారు. వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణించిన నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా, సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రావెలర్స్ యజమానులకు ఎస్పీ హెచ్చరిక
ట్రావెల్స్ యజమానులు కార్లు అద్దెకు ఇచ్చేముందు విచారించి ఇవ్వాలని ఎస్పీ పీ శ్రీనివాస్ తెలిపారు. స్మగ్లింగ్ లాంటి కార్యకలాపాలకు ఉపయోగించే వారికి ఇవ్వడం వల్ల యజమానులు కూడా బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్లు స్వాధీనం చేసుకుంటామని, అదే సమయంలో విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు.