- ప్రజల ఆరోగ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి…
- చిగురుమామిడిజనసముద్రం న్యూస్ సెప్టెంబర్ 19::
- ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని,ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్ లను ప్రభుత్వం నిర్మిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తెలిపారు.బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో 5లక్షల రూపాయలతో నిర్మించనున్న ఓపెన్ జిమ్ కు సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఏఈ నిరంజన్ కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్దె లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు.బహిరంగ ప్రదేశాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మండలంలోని 9గ్రామాలకు ఒక్కో గ్రామానికి 5లక్షల రూపాయలను ఓపెన్ జిమ్ ల నిర్మాణానికి మంజూరు చేసినట్లు వివరించారు.అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే గ్రామాల అభివృద్ధికి అనేక నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.ఓపెన్ జిమ్ లను మంజూరు చేసిన రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులుధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మంజుల,మాజీ సర్పంచ్ శ్రీముర్తి రమేష్,మాజీ ఎంపీటీసీలు మెడబోయిన తిరుపతి,కాశబోయిన నరసయ్య, స్పోర్ట్స్ కమిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెన్న రాజు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలగందుల లక్ష్మణ్,మడక కృష్ణ,కొడముంజ మహేందర్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ బోయిని వేణు,జీల సంపత్,నాంపల్లి సదానందం,ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్లపల్లి సత్యం,గందే రాజయ్య,తులాల కనకయ్య,కక్కర్ల వెంకటేశం, తులాయిల సుధాకర్,ఎలగందుల శివకుమార్,ఐలయ్య,నాంపల్లి ఎల్లయ్య,గందే రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…